అమరావతి టిక్కెట్ ఆశిస్తున్న రాష్ట్రపతి కుమారుడు

PNR| Last Modified శుక్రవారం, 11 సెప్టెంబరు 2009 (21:04 IST)
అసెంబ్లీ ఎన్నికల్లో రీజియన్‌లోని అమరావతి నియోజకవర్గ టిక్కెట్‌ను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రాజేంద్ర పాటిల్ షెకావత్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.

దీనిపై ఆయన శుక్రవారం ముంబైలో మాట్లాడుతూ.. అమరావతిలో చాలా సంవత్సరాలుగా ఎన్నో ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వీటిని ఆధారంగా టిక్కెట్‌ దక్కుతుందనే ఆశలు పెట్టుకున్నారు. అమరావతిలో విద్యా సంస్థలతో తనకు సంబంధాలు ఉన్నాయని, వీటితో పాటు తనకు సామాజిక సేవా స్పృహ కూడా ఉందన్నారు.

ఈ విషయాలన్నింటిని కాంగ్రెస్ పార్టీ పరిగణంలోకి తీసుకుని టిక్కెట్ కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన పార్టీ బృందం ముందు హాజరయ్యారు. అసెంబ్లీ టిక్కెట్ కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.


దీనిపై మరింత చదవండి :