కోయంబత్తూరులోని ఓ హోటల్‌ను బాంబు పేలుడుతో ధ్వంసం చేస్తామని ప్రముఖ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. కోయంబత్తూరులో జూన్ 23వ తేదీ నుంచి ప్రాచీన తమిళ భాషపై అంతర్జాతీయ సదస్సు జరుగనుండటంతో.. కోవైలోని ఓ ప్రసిద్ధ హోటల్‌ను పేల్చి వేస్తామని అల్‌ఖైదా ఇ-మెయిల్ ద్వారా బెదిరించింది.