జశ్వంత్ సింగ్ పాక్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్!

Jaswant Singh
SELVI.M|
FILE
"జిన్నా-ఇండియా-పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్‌" పుస్తకంపై ప్రచారం కోసం పాకిస్తాన్‌లో పర్యటించేందుకు గానూ భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత జశ్వంత్ సింగ్‌‌కు కేంద్రం అనుమతినిచ్చింది.

తాను రాసిన "జిన్నా-ఇండియా-పార్టిషన్ అండ్ ఇండిపెండెన్స్‌" పై ప్రచారం కోసం జశ్వంత్ పాక్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి జశ్వంత్ సింగ్ పాకిస్తాన్‌లో పర్యటించనున్నారు.

ఈ నెల 26వ తేదీన కరాచీ చేరుకోనున్న జశ్వంత్ సింగ్.. మరుసటి రోజు (27వతేదీ) పుస్తక ఆవిష్కరణ దినోత్సవంలో పాల్గొంటారు. ఇస్లామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి బీజీపీ పాకిస్తాన్ వ్యవస్థాపకులు మొహమ్మద్ అలి జిన్నా హాజరవుతారు.

ఇకపోతే.. జశ్వంత్ సింగ్ పాక్ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు తగిన భద్రతా ఏర్పాట్లు కూడా చేసిందని ఓ ఆన్‌లైన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.


దీనిపై మరింత చదవండి :