జేకే ఎన్‌కౌంటర్‌లో 9 మంది మిలిటెంట్లు హతం

PNR| Last Modified బుధవారం, 5 ఆగస్టు 2009 (15:59 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో తొమ్మిది మంది మిలిటెంట్లు హతమయ్యారు. పూంఛ్ జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మిలిటెంట్లను భద్రతా దళాలు హతమార్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రవాదుల చొరబాట్లు ఉన్నట్టు భద్రతా వర్గాలు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.

దీంతో స్థానిక పోలీసుల సహకారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సంయుక్త ఆపరేషన్‌లో భద్రతా దళాలకు, తీవ్రవాదులకు పలు ప్రాంతాల్లో వేర్వేరుగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో హిజ్‌బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన కరుడుగట్టిన తీవ్రవాది నూర్ మొహ్మద్‌తో పాటు.. మరో ఎనిమిది మిలిటెంట్లు హతమైనట్టు భద్రతాధికారులు వెల్లడించారు.


దీనిపై మరింత చదవండి :