నాకెవరి సాయం అవసరం లేదు: బూటా

Phani|
కుమారుడు లంచం ఆరోపణల్లో చిక్కుకోవడంతో ఇబ్బందుల్లో పడిన జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బూటా సింగ్ మంగళవారం మాట్లాడుతూ.. ఈ ఆరోపణల నుంచి బయటపడేందుకు తనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ముందు రోజు బూటా సింగ్ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో భాగమని, ఆయన పార్టీ వ్యవస్థలోని వ్యక్తి కాదని కాంగ్రెస్ పేర్కొంది.

ఈ నేపథ్యంలో బూటా సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు తనకు ఎవరి సాయం అవసరం లేదని, తానే ఈ వ్యవహారాన్ని చూసుకోగలనని చెప్పారు. లంచం కేసు విషయంలో తనకు పార్టీ సాయం అవసరం లేదన్నారు.

దళితుల సంక్షేమం కోసం తాను అహర్నిశలు శ్రమించానని, తాను జాతీయ ఎస్టీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితే వస్తే ప్రాణత్యాగం చేస్తానని హెచ్చరించారు. తనకు ఈ కేసులో పార్టీ సాయం అవసరం అవుతుందని భావించడం లేదు. దీనిని తానే సమర్థవంతంగా ఎదుర్కోగలనన్నారు. ఎందుకంటే న్యాయం తన పక్షాన ఉందని బూటా సింగ్ విలేకరులతో చెప్పారు.


దీనిపై మరింత చదవండి :