జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖపై పాక్‌వైపు నుంచి చొరబాట్లు పెరుగుతున్నాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. మిలిటెంట్ గ్రూపులు కాశ్మీర్‌లోకి చొరబడుతుండటం ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అస్థిరత్వాన్ని సృష్టించేందుకు బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.