నేడు కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ భేటీ!

PNR| Last Modified గురువారం, 10 సెప్టెంబరు 2009 (16:35 IST)
కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి గురువారం సాయంత్రం ఆరు గంటలకు భేటీ కానుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసమైన నంబరు టెన్, జనపథ్‌లో జరిగే ఈ కీలక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ముఖ్యమంత్రిత్వంపై చర్చించేందుకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటి గురువారం సాయంత్రం నాలుగు గంటలకు భేటీ కానున్నది.

సాధారణంగా పార్టీలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రమే కోర్‌ కమిటి భేటీ అవుతుంది. దీంతో సాయంత్రం జరిగే కోర్ కమిటి సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

సాధారణంగా కోర్ కమిటి సమావేశాన్ని శుక్రవారం రోజున నిర్వహించడం ఆనవాయితీ. అయితే, ఆంధ్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశాన్ని గురువారమే నిర్వహిస్తుండటం మరో విశేషాంశం.


దీనిపై మరింత చదవండి :