ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలను బలితీసుకున్న హెలికాఫ్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో వైఎస్సార్ మృతి చెందిన సంగతి తెలిసిందే.