యడ్యూరప్ప రాజీనామాకు మధ్యాహ్నం ముహూర్తం!

SELVI.M|
యడ్డ్యూరప్ప రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు యడ్డూరప్ప తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించనున్నారు. తద్వారా కర్ణాటకలో సంక్షోభం నిర్ణాయక దర్శకు చేరుకుంది. యడ్డ్యూరప్ప రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

ఇదిలా ఉంటే.. పార్టీ అధిష్టానం ఒత్తిడి పెంచడంతో యడ్డ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు కర్నాటకలో బాగా వినిపిస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీ అధిష్టానం తనను తప్పించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఆయన కర్నాటక జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధపడ్డట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి.


దీనిపై మరింత చదవండి :