1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. 2,000 Jawa, Yezdi and BSA riders unite and celebrated India-s 80th Independence Day

80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుక, ఐక్యంగా 2 వేల మంది జావా, యెజ్డీ, BSA రైడర్స్

2,000 Jawa, Yezdi and BSA riders celebrated 80th ID Day
భారతదేశపు 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి గుర్తుగా జావ, యెజ్డీ, BSA రైడర్స్ నొమాడ్స్ బ్యానర్స్ కింద దేశవ్యాప్తంగా రైడ్స్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మోటార్ సైక్లింగ్‌లో ఉన్న స్వేచ్ఛా స్ఫూర్తిని తెలియచేసింది. 150 డీలర్‌షిప్స్ ద్వారా స్వాతంత్ర్య దినోత్సవం రైడ్‌లో 2,000 మంది రైడర్స్‌ను ఒక చోట కలిపింది. వీరిలో వివిధ నేపధ్యాలు, వయస్సులకు చెందిన సమూహాలు, రైడింగ్ శైలులు ఉన్నాయి. ఈ కార్యక్రమం జావా, యెజ్డీ, BSA కమ్యూనిటీలలోని రైడర్స్‌ను కలపడం కొనసాగిస్తున్న ఉమ్మడి అభిరుచిని, స్నేహ స్ఫూర్తిని సూచించింది.
 
బ్రాండ్స్, ప్రాంతాలు, తరాల హద్దులను దాటి, నోమాడ్స్ జావా, యెజ్డీ మరియు BSA రైడర్స్ అందరికీ ఒక ఉమ్మడి గుర్తింపుగా నిలుస్తుంది. రైడర్స్ ద్వారా రూపొందించబడి మరియు ఉమ్మడి అనుభవాలతో తీర్చిదిద్దబడిన, ఇది తన వారితో కలిసి ప్రయాణించడంలో ఉన్న సమీకృత భావన మరియు ఆనందాన్ని సూచిస్తుంది. ఇటీవల, క్లాసిక్ లెజెండ్స్ శౌర్య విజయ యాత్ర కోసం భారత సాయుధ సైన్యంతో కలిసి భారత సైనికుల సాహసం, సేవా మరియు త్యాగాలకు నివాళులు అర్పించింది. స్వాతంత్ర్య దినోత్సవం రైడ్ ఇదే జాతీయ గౌరవం యొక్క స్ఫూర్తిని ప్రతిధన్వించింది మరియు దేశం మరియు మోటార్ సైక్లింగ్ రెండిటినీ నిర్వచించే స్వేచ్ఛను వేడుక చేయడానికి రైడర్లకు అవకాశం కల్పించింది.
 
అనుపమ్ థరేజా, సహ-స్థాపకులు, క్లాసిక్ లెజెండ్స్, ఇలా అన్నారు, మోటార్ సైక్లింగ్ కేంద్రంలోనే మీకు ఇష్టమైన దారిని సొంతం చేసుకునే స్వేచ్ఛ, ఆ ప్రయాణాన్ని ఇతరులతో భాగస్వామం చేసుకునే ఆనందం ఉంది. స్వేచ్ఛను సాధ్యనం చేసిన విలువలను మరియు ఆ స్వేచ్ఛను కాపాడం కొనసాగిస్తున్న త్యాగాలను స్వాతంత్ర్య దినోత్సవం గుర్తు చేస్తుంది. గత నెలలోనే, కార్గిల్ విజయ్ దివస్ నాడు, మన సైనికుల సాహసం, సేవలు మరియు త్యాగాలను గౌరవించే అవకాశం మాకు లభించింది. నేడు, నోమెడ్స్ ద్వారా, వివిధ ప్రాంతాలకు చెందిన రైడర్స్ మరియు తరాలు మన సాయుధ దళాలకు ప్రతీకగా నిలిచిన  అదే స్వాతంత్ర్యపు స్ఫూర్తిని వేడక చేయడానికి  ఒక చోట చేరాయి. 
 
నోమడ్స్ కమ్యూనిటి వృద్ధి చెందడం కొనసాగుతున్న కారణంగా, ఇలాంటి రైడ్స్ మరియు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉన్న  జావా, యెజ్డీ మరియు BSA రైడర్స్ మధ్య సంబంధాలను మరింత శక్తివంతం చేస్తాయి, మోటార్ సైక్లింగ్ పట్ల ఉమ్మడి అభిరుచి ద్వారా లోతైన సంబంధాలను ప్రోత్సహిస్తాయి.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఈరోజుల్లో మద్యం తాగడం అంతా కామన్ నాన్నా, కుమార్తె మాటలకు తండ్రి గుండె బద్ధలైంది