1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. 3 Dead In Massive Fire At Bihar Hospital's ICU Ward, More Casualties Feared

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... రోగులను వదిలేసిన పారిపోయిన సిబ్బంది

fire
బీహార్ రాష్ట్రం ముజఫర్ పూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో మంటలు చెలరేగగా రోగులను వదిలివేసి ఆస్పత్రి సిబ్బంది పారిపోయారు. ఆస్పత్రిలో భారీ మంటలు చెలరేగగా ఈ ఘటనలో ముగ్గురు రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. 
 
ప్రసాద్‌ ఆస్పత్రిలోని ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూలో మంటలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున 3:55 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పెద్దఎత్తున మంటలు చెలరేగగా.. దట్టమైన పొగ భవనాన్ని కమ్మేసింది. దీంతో ఆస్పత్రిలో గందరగోళం నెలకొంది. 
 
ఐసీయూ నుంచి 20 మంది రోగులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్‌ యూనిట్‌, మానిటర్ సిస్టమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 
About Writer
ఠాగూర్