1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. 50,000 Farmers Die from Snakebites Annually; Protection with the help of Kisan Mitra Stick Device

ఏడాదికి 50 వేల మంది రైతులు పాము కాటుతో మరణం, కొత్త పరికరంతో చెక్

Kisan Mitra Stick Device protection from Snakebites
భారతదేశంలో పాము కాటు వల్ల చనిపోతున్న వారి సంఖ్య ప్రతి ఏటా సుమారు 50,000 నుండి 60,000 మంది వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ నివారణ చర్యలకు ఉపక్రమించింది. రైతుల కోసం ప్రత్యేకంగా కిసాన్ మిత్ర చడి అనే పరికరాన్ని తయారుచేస్తోంది. ఈ పరికరాన్ని పొలాలకు వెళ్లినప్పుడు లేదా బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు నేలపై వుంచితే అది 10 మీటర్ల పరిధిలో పాములు వుంటే వాటి కదలికను గమనించి వైబ్రేట్ అవుతుంది. దాంతో రైతు సమీపంలో పాములు వున్నాయన్న సంగతిని గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు.
 
పాము కాటుకు గురవుతున్న వారిలో అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, వ్యవసాయ కూలీలే. పొలాల్లో పని చేసే సమయంలో, ముఖ్యంగా వర్షాకాలంలో వీరు ఎక్కువగా పాము కాటుకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాము కాటు వల్ల జరిగే మరణాల్లో దాదాపు సగం మరణాలు భారతదేశంలోనే సంభవిస్తున్నాయి.
 
పొలాల్లో రక్షణ కవచాలు (బూట్లు వంటివి) లేకుండా తిరగడం, సరైన సమయంలో ఆసుపత్రికి చేరుకోలేకపోవడం, నాటు వైద్యంపై ఆధారపడటం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. అధికారికంగా నమోదవుతున్న కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, మిలియన్ డెత్ స్టడీ వంటి పరిశోధనలు వాస్తవ మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. 2025 నాటి గణాంకాల ప్రకారం కేవలం కర్ణాటక రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి.
 
ప్రభుత్వం ప్రస్తుతం పాము కాటును 'నోటిఫైడ్ డిసీజ్' (తప్పనిసరిగా నమోదు చేయాల్సిన వ్యాధి)గా ప్రకటించాలని రాష్ట్రాలకు సూచిస్తోంది, దీనివల్ల బాధితులకు నష్టపరిహారం, మెరుగైన చికిత్స అందే అవకాశం ఉంటుంది.
About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడంలేదు: నిశ్చితార్థమైన యువతితో కాబోయే భర్త, యువతి సూసైడ్