శుక్రవారం, 23 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 డిశెంబరు 2025 (23:21 IST)

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

young woman who got into a Rapido after drinking liquor
ఇటీవలి కాలంలో అర్థరాత్రుల వేళ మద్యం సేవించి పట్టుబడుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఐతే వీరిలో మహిళలు కూడా వుండటం గమనార్హం. ఇక అసలు విషయానికి వస్తే... ఢిల్లీ నైట్ క్లబ్బులో పూటుగా మద్యం సేవించిన ఓ యువతి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నది. బైక్ అయితే ఎక్కింది కానీ తలకు మత్తు బాగా ఎక్కడంతో బైకు పైనుంచి జారిపోయి కిందపడబోయింది.
 
ఇంతలో ర్యాపిడో బైక్ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బైకును ఆపి ఆమెను పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకున్నప్పటికీ ఆమె వాహనం పైనుంచి జారిపోయి రోడ్డుపై పడి లిక్కర్ మత్తులో జోగిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నైట్ పార్టీల పేరుతో కొందరు మహిళలు ఇలా లిక్కర్ పార్టీలు చేసుకుని హద్దులు దాటి పోతున్నారనీ, అలా స్పృహ లేని స్థితికి వెళ్లిపోతే జరగరానిదేదైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.