కుపే బోగీలో జంట హనీమూన్ డెకరేషన్ - టీటీపీపై సస్పెన్షన్ వేటు (వీడియో)
రైలులో ఓ యువ జంట చేసిన పనికి టీటీఈపై సస్పెన్షన్ వేటు పడింది. ఫస్ట్ క్లాస్ ఏసీ కుపే బోగీని ప్రత్యేకంగా బుక్ చేసుకున్న ఓ జంట.. ఆ బోగీని అందంగా అలంకరించుకుంది. ముఖ్యంగా హనీమూన్ (శోభనం పడక గది) డెకరేషన్ చేయించుకుని, అక్కడ ప్రత్యేకంగా ఫోటో షూట్, వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.
బెంగాల్‌లోని బల్లార్షా నుంచి ముంబై వెళ్లే 11002 నిందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ కుపే బోగీలో ఈ దృశ్యాలు కనిపించాయి. ఇందులో ప్రయాణించిన ఒక జంట ఆన్‌లైన్‌లో ఒక డెకరేటర్‌ను బుక్ చేసుకుని తమ ఫస్ట్ ఏసీ కుపేను అందంగా అలంకరించుకుంది. ఆ తర్వాత అందులో వీడియో, ఫోటోలు తీసుకున్నారు. అంతటితో మిన్నకుంటే సరిపోయేది. కానీ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది.
దీంతో నెటిజన్లు పలు రకాలైన కామెంట్స్ చేయసాగారు. ఈ విషయం మెల్లగా రైల్వే శాఖ దృష్టికి చేరింది. డెరకేటర్ అనధికారికంగా రైల్లోకి రావడాన్ని తీవ్రమైన వైఫల్యంగా పరిగణించింది. తన విధుల్లో టీటీఈ నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఇలా జరిగిందని భావించిన రైల్వే శాఖ టీటీఈని సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న భారతీయ రైల్వే 'ఫస్ట్ ఏసీ' (1st AC) క్యాబిన్ విజువల్స్..
— RTV (@RTVnewsnetwork) July 8, 2026
గులాబీ పూలు, బెలూన్లు, రంగురంగుల లైట్లతో లగ్జరీ హోటల్ రూమ్‌లా మారిన రైలు బోగీ..
రైలు ప్రయాణంలో ఇలాంటి డెకరేషన్ చూడటం ఇదే తొలిసారి అంటూ నెటిజన్ల ఆశ్చర్యం..
"మాకు కూడా ఇలాంటి సర్వీస్ కావాలి,… pic.twitter.com/vOvsY5ymV8
