మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 15 జనవరి 2016 (13:08 IST)

#happytobleed.... అయ్యప్ప దర్శనం కోసం మహిళ... న్యాయవాదికి డెత్ థ్రెట్స్... చస్తావా....?

స్వామియే శరమణమయ్యప్పా.... అయ్యప్ప శరణం... స్వామి శరణం... మకర సంక్రమణంలో కేరళలోని శబరిమల గిరులు అయ్యప్ప శరణు ఘోషతో మిన్నంటుతాయి. ఐతే ఇప్పుడు అయ్యప్ప స్వామి దర్శనం కోసం మహిళలు చేస్తున్న #happytobleed ఉద్యమం, ఆ మహిళల తరపున సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన ఓ న్యాయవాదికి డెత్ థ్రెట్స్ వస్తున్నాయి. అసలింతకీ అయ్యప్ప స్వామి దర్శనానికి, మహిళలకు, న్యాయవాది డెత్ థ్రెట్స్‌కి సంబంధం ఏంటనేగా సందేహం. ఐతే వివరాలు తెలుసుకోవాల్సిందే. 
 
శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శకునే అర్హత... ప్రత్యేకించి మహిళలకు 10 ఏళ్ల లోపు, 50 ఏళ్ల పైబడినవారికే ఉంటుంది. 10 ఏళ్లు పైబడిన దగ్గర్నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు ప్రవేశం నిషిద్ధం. బహిష్టు అయిన మహిళ శబరిమల స్వామి చెంతకు రాకూడదు. ఆమె అలా వచ్చినట్లయితే ఆలయం అపవిత్రమవుతుంది. ఫలితంగా అరిష్టం జరుగుతుంది. ఇది ఎన్నో ఏళ్లుగా విశ్వాసంగా వస్తున్నది. ఐతే ఇటీవల కొందరు మహిళలు మాత్రం తాము దర్శనం చేసుకుని తీరాల్సిందే అని పట్టుబట్టారు. 
 
పైగా సోషల్ మీడియాలో #happytobleed అంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు. వారికి మద్దతుగా పలువురు ముందుకు వస్తున్నారు. దీనితో విషయం ఆలయ పూజారుల వద్దకు వెళ్లింది. ఐతే వారిని అనుమతిస్తాము కానీ.... ఆ సమయంలో వారు బహిష్టు కాకుండా ఉన్నారో లేదో ఓ యంత్రంగా ద్వారా పరీక్షించి ఆ తర్వాత అనుమతిస్తామని తేల్చి చెప్పారు. దీనితో వ్యవహారం  మరింత ముదిరింది. #happytobleed అనే నినాదంతో ముందుకు కదులుతున్నారు. వారికి మద్దతుగా ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నౌషాద్ అహ్మద్ ఖాన్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. 
 
దీనితో ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ఇప్పటివరకూ 500 కాల్స్ వచ్చినట్లు చెప్పారు. సుప్రీంకోర్టులో ఆ మహిళ తరపున వేసిన పిటీషన్ ను వెనక్కి తీసుకోవాలని వారు బెదిరిస్తున్నారట. ఈ బెదిరింపు కాల్స్ కూడా ఎక్కువగా అమెరికా నుంచి వస్తుండటం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారణ జరుపనుంది. మరోవైపు ఆలయ సిబ్బంది మాత్రం 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు శబరిమల కొండపై అయ్యప్ప దర్శనానికి అర్హత లేదని తేల్చి చెపుతున్నారు.