యువతికి హోలీ రంగులు పూసి మత్తుపానీయం త్రాగించి తోటలోకి తీసుకెళ్లి...
స్నేహం చాటున ఆ యువతిపై కన్నేసాడు యువకుడు. అదనుకోసం చూస్తున్న అతడికి హోలీ పండుగు రూపంలో వచ్చింది. స్నేహితురాలిపై ఫుల్లుగా రంగులు పులిమాడు. అలసిపోయిన ఆమెకి తాగేందుకు పానీయం ఇచ్చాడు. ఐతే అందులో మత్తుమందు కలిపాడు. దాంతో ఆమె మత్తులోకి జారుకున్నది. వెంటనే ఆమెను భుజాన వేసుకుని సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
కానీ అదృష్టవశాత్తూ, కారులో ఉన్న కొంతమంది అతను అమ్మాయిని తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసి అతన్ని వెంబడించారు. ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నిస్తున్న సమయంలో వీరంతా అక్కడికి వెళ్లారు. దాంతో అతడు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత, కారులో ఉన్న వ్యక్తులు అమ్మాయిని సురక్షితంగా ఇంటికి చేర్చారు. కనుక స్నేహితులైనప్పటికీ యువతులెవరూ ఒంటరిగా వెళ్లేటప్పుడు ఒకటికి వందసార్లు ఆలోచించాల్సి వుంటుందని ఈ ఘటన చెపుతోంది.