1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Acid Attack On Sleeping Husband Leaves Man Blind Forever: UP Court Awards Life

ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.. భర్త ముఖంపై యాసిడ్ పోసింది.. జీవితఖైదు

Acid
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో జరిగిన ఒక అత్యంత క్రూరమైన, సంచలనమైన యాసిడ్ దాడి కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిద్రపోతున్న భర్త ముఖంపై యాసిడ్ పోసి, అతడిని శాశ్వత అంధుడిని చేసిన 30 ఏళ్ల కహకషా అనే మహిళకు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘోరానికి పాల్పడినందుకు గాను ఆమెకు జైలు శిక్షతో పాటు రూ. 1.75 లక్షల జరిమానా కూడా విధించింది.
 
బిజ్నోర్ జిల్లా నజీనాకు చెందిన కహకషా, సంభాల్‌కు చెందిన ముజఫర్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఐదేళ్ల కుమార్తె, రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు. ముజఫర్ దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, కహకషా ఇంటిని చూసుకునేది. కాలక్రమేణా కహకషాకు పొరుగున ఉండే ఒక యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ముజఫర్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. మార్చి 7, 2025న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఇదే ఈ ఘోరానికి పాల్పడింది.
 
అయితే, భర్తపై కక్ష పెంచుకున్న కహకషా.. అదే రోజు మార్కెట్‌కు వెళ్లి యాసిడ్ కొనుగోలు చేసింది. ఆ రాత్రి ముజఫర్ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆయన ముఖం, కళ్లపై నేరుగా యాసిడ్ పోసింది. తీవ్ర గాయాలైన ముజఫర్‌ను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా.. ఆయన ఆరు నెలల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, యాసిడ్ తీవ్రతకు ఆయన రెండు కళ్ల చూపు పూర్తిగా పోయి శాశ్వత అంధుడిగా మారారు. తాజాగా కోర్టు నిందితురాలికి జీవిత ఖైదు విధించింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బంగారు నిల్వలు 880.52 టన్నులు వున్నాయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ