సంబంధిత వార్తలు
- ధర్మస్థల కేసు : చిన్నయ్యకు తనకు ఎలాంటి సంబంధం లేదు : ప్రకాష్ రాజ్
- మేం జంతువులం కాదు మౌనంగా ఉండటానికి : ప్రకాష్ రాజ్
- పవన్‌ను దొర అంటూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు - కర్రుకాల్చి వాత పెట్టిన నటి హేమ (Video)
- డిపాజిట్లు గల్లంతైన వారూ ప్రశ్నిస్తారా? పవన్ ఫ్యాన్స్ 'జస్ట్ ఆస్కింగ్'
- పొత్తుతో వస్తున్నారా, సింగిల్‌గానా? పవన్‌పై ప్రకాష్ రాజ్ ట్వీట్: నీకెందుకురా అంటూ బండ్ల గణేష్ ఫైర్
నటుడు ప్రకాష్ రాజ్‌కు నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు - నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు నాలుగు రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. దక్షిణాదిలో నాలుగు రాష్ట్రాల్లో ప్రకాష్ రాజ్‌కు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి. దీనిపై గత 2019లో ప్రకాష్ రాజ్‌ప న్యాయవాది దిలీప్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆయనకు పలుమార్లు నోటీసులు పంపించినా ప్రకాష్ రాజ్ స్పందించలేదు. దీంతో బెంగుళూరులోని 48వ ఏసీజేఎం కోర్టు శనివారం ప్రకాష్ రాజ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాష్ రాజ్‌కు ఒకే సమయంలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయంటూ గత 2019లో అడ్వకేట్ దిలీప్ కుమార్ బెంగుళూరులోని హలసూర్ గేట్ పోలీస్ స్టేషనులో తొలిసారి ఫిర్యాదు చేశారు. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయనకు ఓటు హక్కు ఉందని, ఇది ముమ్మాటికీ ప్రజాప్రాతినధ్య చట్టం ప్రకారం చట్టు విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ అక్రమ ఓట్ల వ్యవహారంపై బృహత్ బెంగుళూరు మహానగర పాలిత (బీబీఎంపీ) అధికారులకు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ న్యాయవాది ఏకంగా కోర్టును ఆశ్రయించారు. ఈ ప్రైవేట్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ఈ కేసు విచారణకు స్వయంగా హాజరుకావాలంటూ ప్రకాష్ రాజ్‌కు సమన్లు జారీచేసింది.
అయితే, కోర్టు ఆదేశాలను నటుడు ప్రకాష్ రాజ్ భేఖాతర్ చేస్తూ, కోర్టు విచారణకు హాజరుకాలేదు. కోర్టు నోటీసులను తేలిగ్గా తీసుకోవడంపై కోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకాష్ రాజ్‌కు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీచేశారు. దీంతో ప్రకాష్ రాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు లేకపోలేదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
