1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. actress sukanya wins 30 year old veerappan case and gets 10 lakh compensation

పీవీ కుమారుడితో సుకన్యకు అక్రమ సంబంధం.. వీరప్పన్ ఇంటర్వ్యూ.. సన్‌టీవీకి షాకిచ్చిన కోర్టు

Sukanya
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తనయుడుతో నటి సుకన్యకు వివాహేతర సంబంధం ఉందంటూ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవించివున్న సమయంలో నక్కీరన్ గోపాల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూను యధాతథంగా సన్ టీవీ ప్రచారం చేసింది. ఈ ఇంటర్వ్యూలోని అనేక అంశాలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని సుకన్య పేర్కొంటూ పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఇపుడు మద్రాస్ హైకోర్టు సైతం సమర్థిస్తూ, నటి సుకన్యకు సన్ టీవీ రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
 
గత 1996 ఏప్రిల్ 17వ తేదీన సన్ టీవీలో నేరుక్కు నేర్ అనే కార్యక్రమం ప్రసారమైంది. తమిళ పత్రిక నక్కీరన్ ఎడిటర్ నక్కీరన్ గోపాల్.. వీరప్పన్‌ను ఇంటర్వ్యూచేశారు. ఈ సందర్భంగా వీరప్పన్ మాట్లాడుతూ, నటి సుకన్యకు మాజీ ప్రధాని వీపీ నరసింహ రావు కుమారుడితో అక్రమ సంబంధం ఉందని నిరాధార ఆరోపణలు చేశారు. 1996 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సుకన్యకు సంబంధించిన కొన్ని వీడియోలను ఉపయోగించుకున్నారని కూడా పేర్కొన్నారు. 
 
అయితే, వీరప్పన్ చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తమని, ఇవి సమాజంలో తన గౌరవానికి, కీర్తి ప్రతిష్టలకు తీవ్ర భంగం కలిగించాయని సుకన్య కోర్టును ఆశ్రయించారు. పైగా, ఈ ఆరోపణలు తనను మానసికంగా కుంగదీశాయని తెలిపారు. ఈ పిటిషన్‌పై సుధీర్ఘ విచారణ అనంతరం 2015లో ట్రయల్ కోర్టు సుకన్యకు అనుకూలంగాతీర్పు ఇచ్చి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీని ఆదేశించింది. దీనిపై సన్ టీవీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా చుక్కెదురైంది. తాజాగా ఈ అప్పీల్ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ కె.కుమరేశ్ బాబు నేతృత్వంలోని ధర్మాసనం సుకన్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
రాజౌరీ జిల్లాలో ఆపరేషన్ షెరువాలి : లోయలో పడి లెఫ్టినెంట్ దుర్మరణం