1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. After UK And Israel, Centre Blocks Another Bhagwant Mann Foreign Trip

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్‌ విదేశీ పర్యటనకు కేంద్రం నో

Bhagwant Mann
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఆయన యూరప్‌లో పర్యటించేందుకు విదేశాంగ శాఖ అనుమతి కోరగా తిరస్కరించింది. దీంతో ముఖ్యమంత్రి మాన్ పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. ఇటీవల మాన్ విదేశీ పర్యటనలకు అనుమతి నిరాకరించడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
 
పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించ తలపెట్టిన 'ఇన్వెస్టర్స్ సమ్మిట్' కోసం పెట్టుబడులను ఆహ్వానించడానికి భగవంత్ మాన్ చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్‌లలో పర్యటించాల్సి ఉంది. పారిశ్రామికాభివృద్ధి, విద్య, విదేశీ పంజాబీల సహకారం కోసమే ఈ పర్యటన ఖరారైంది. అయితే కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
 
రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశాల్లో పర్యటించేందుకు విదేశాంగ శాఖ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. దీనినే పొలిటికల్ క్లియరెన్స్‌గా వ్యవహరిస్తారు. అయితే, ఈ నిబంధన చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. పంజాబ్ విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పర్యటనలపై కేంద్రం వరుసగా ఆంక్షలు విధిస్తోంది. పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరిస్తోంది.
 
ఈ యేడాది జనవరిలో యూకే, ఇజ్రాయెల్‌లో పర్యటించేందుకు మాన్ అనుమతి కోరగా నిరాకరించింది. గతంలో పారిస్ ఒలింపిక్స్ సందర్శనకూ ఇలాగే అడ్డుచెప్పడంతో ఆ పర్యటన రద్దయింది. తాజాగా చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్ పర్యటనకూ మాన్‌కు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. ఇపుడు ఈ అంశం కేంద్ర - రాష్ట్ర సంబంధాల మధ్య మరోసారి చిచ్చు రేపింది. కాగా, కేంద్రం వైఖరిని ఆప్ తీవ్రంగా ఖండిస్తోంది. బీజేపీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆప్ నేతలు మండిపడుతున్నారు. 
తర్వాతి కథనం
మరో సంచలనానికి సిద్ధమవుతున్న రిలయన్స్... త్వరలోనే హోం ఇన్వర్టర్లు