గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2015 (18:58 IST)

కాలుష్య భూతం ధాటికి ప్రతీయేటా.. 6,20,000 మంది మృతి.. ఎక్కడ?

వాతావరణ కాలుష్య భూతం ప్రతియేటా భారీ సంఖ్యలో ప్రజల్ని పొట్టనబెట్టుకుంటోంది. తాజాగా బాడీ బర్డెన్ -2015 నివేదిక ద్వారా కాలుష్యంతో మరణించేవారి సంఖ్య రోజురోజుకి పెచ్చరిల్లిపోతోందని తేలింది. ఈ వాయు కాలుష్యం చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని నివేదిక తేల్చింది. 
 
దేశవ్యాప్తంగా వాహనాలు, కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల ప్రతి ఏడాది 6,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని బాడీ బర్డెన్ నివేదిక తేల్చింది. ముఖ్యంగా కాలుష్యం బారిన పడి దేశ రాజధాని నగరం ఢిల్లీలోనే మాత్రమే ప్రతి ఏడాది 30వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆ నివేదిక షాక్ ఇచ్చే అంశాలను వెల్లడించింది. 
 
అలాగే ఏసీ, ఫ్రిజ్, కిరోసిన్ స్టవ్‌ నుంచి వెలువడే ఇంటిలోపలి కాలుష్యం ద్వారా ప్రతి ఏటా 15లక్షల మంది దుర్మరణం పాలవుతున్నారని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ అనే పరిశోధన సంస్థ వెలువరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో 2015వ సంవత్సరం 600 మంది ప్రజలు వాతావరణ కాలుష్యంతో ప్రాణాలు కోల్పోయారు.