1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Akhilesh Yadav erupts in Lok Sabha over NEET discussion

అమ్మాయిల దుస్తులు చించేస్తారా? కేంద్రంపై విరుచుకుపడిన అఖిలేష్

akhilesh yadav
కేంద్ర ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడంతో పాటు అమ్మాయిల దుస్తులు చించేస్తారా అని ప్రశ్నించారు. 
 
ఢిల్లీలో ఆందోళన చేసిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆందోళన చేస్తోన్న అమ్మాయిల దుస్తులు చించేస్తారా..? అని ప్రశ్నించారు.
 
'మీరు విద్యార్థుల బాధ వినకపోతే.. వారు వీధుల్లోకి వస్తారు. అలా వచ్చి ఆందోళన చేస్తోన్న విద్యార్థులతో పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. అమ్మాయిల దుస్తులు చించేశారు. విద్యార్థులను లాఠీలతో కొట్టారు. దాంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారితో ఇలాగేనా ప్రవర్తించేది..? ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలి. విద్యార్థుల సమస్యపై బయట మాట్లాడుతోన్న ప్రధాని.. సభలో ఎందుకు ప్రకటన చేయడం లేదు. మోదీ సభలో మాట్లాడేందుకు నిరాకరించడం వల్లే.. మేం ఆయన నివాసం వద్ద నిరసన చేయాల్సి వచ్చింది' అని అఖిలేశ్ అన్నారు.
 
ఛలో పార్లమెంటు సందర్భంగా సోమవారం విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ప్రధాని ఇంటి దగ్గర కాంగ్రెస్‌ పార్టీ మెరుపు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. లాఠీఛార్జికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండు చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీతోపాటు అఖిలేశ్ యాదవ్ కూడా ఆ నిరసనలో పాల్గొన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Narendra Modi, ప్రధాని మోడీ టైంపాస్ చేసే సమయం 2 నిమిషాలే, ప్రపంచంలో హిందుస్థాన్ శక్తి