1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. andhra pradesh : husband suicide attempt with lover in front of wife

భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి భర్త ఆత్మహత్యాయత్నం

husband - lover suicide attempt
రైలు ప్రయాణంలో భార్య కళ్లెదుటే భర్తతో పాటు అతని ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భర్తను, అతని ప్రియురాలిని కోయంబత్తూరు నుంచి రైలులో తీసుకొస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఛప్రా గ్రామానికి చెందిన శిరీశ్‌కుమార్‌ (34), సులోచన దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. శిరీశ్‌ ఆటో నడుపుతాడు. ఇతడికి ఛప్రా గ్రామంలోనే ఓ వివాహిత (34)తో పరిచయం ఏర్పడింది. భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ వివాహిత పిల్లలతో కలిసి హైదరాబాద్‌ మూసాపేటలోని సోదరి ఇంట్లో నివాసముంటోంది. తరచూ ఈమెను కలిసేందుకు శిరీశ్‌కుమార్‌ శ్రీకాకుళం నుంచి మూసాపేటకు వచ్చి పోతుండేవాడు. 
 
ఈ క్రమంలో నెలరోజుల కిందట వీరిద్దరూ మాయమయ్యారు. తన భర్త ప్రియురాలితో వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్న సులోచన.. కోయంబత్తూరులో వీరు నివాసముంటున్నారని తెలుసుకుని బంధువులతో కలిసి అక్కడకు వెళ్లారు. ఇద్దరినీ గుర్తించి వారిని తీసుకుని సోమవారం మధ్యాహ్నం శబరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. 
 
మంగళవారం ఉదయం 11 గంటలకు రైలు చర్లపల్లి సమీపంలోకి రాగానే శిరీశ్‌కుమార్, అతడి ప్రియురాలు బాత్‌రూంకు వెళ్లి గడ్డి మందు ద్రావణాన్ని తాగారు. వెంటనే సులోచన తోటి ప్రయాణికుల సహాయంతో సికింద్రాబాద్‌ ఆర్పీఎఫ్‌ పోలీసులకు సమాచారమందించగా.. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మెరుగైన చికిత్స చేయిస్తానని చెప్పి కదిరి ఆస్పత్రిలో భార్యను హత్య చేసిన భర్త