సంబంధిత వార్తలు
- గంటకు 100 కి.మీ వేగంతో కారుతో ఢీకొట్టి ప్రియుడిని చంపిన ప్రియురాలు, 15 ఏళ్లు జైలు శిక్ష
- రీల్స్ పిచ్చి, వాటర్ ట్యాంక్ ఎక్కారు, నిచ్చెన ఊడిపోయి చిక్కుకుపోయారు, వీడియో
- ప్రియురాలి కోసం ఏకంగా టవరెక్కిన ప్రియుడు..
- ప్రియురాలి మొండెం ఫ్రిడ్జిలో... తలను తీసుకెళ్లి నిప్పు పెట్టాడు...
- విశాఖలో దారుణం: ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టాడు
గ్రాడ్యుయేషన్ పరేడ్ అనంతరం ప్రియురాలికి రొమాంటిక్ ప్రపోజల్ (వీడియో)
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ (సీఏఏటీసీ) ఒక అరుదైన ప్రేమ పట్టానికి వేదికైంది. తన పైలెట్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఓ ఆర్మీ కెప్టెన్. అదే వేదికపై తన ప్రియురాలికి చేసిన రొమాంటిక్ ప్రపోజల్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు నుంచి ప్రశంసల వెల్లువెత్తుతున్నప్పటికీ కొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కెప్టెన్ భర్త భరద్వాజ్ నాసిక్‌లోని సీఏఏటీఎస్‌లో తన ఫ్లైట్ టైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ నెల 2వ తేదీన పాసింగ్ ఔట్ పరేడ్ అనంతరం ఆయన తన ప్రియురాలు అరుషికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. తన వృత్తి జీవితంలో కీలకమైన మైలురాయిని అందుకున్న రోజే వ్యక్తిగత జీవితంలోనూ మరో అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నారు.
సైనిక వేడుకల కోసం ధరించిన యూనిఫాంలోనే, పక్కనే పార్క్ చేసి ఉన్న ఆర్మీ హెలికాఫ్టర్ ముందు తన ప్రియురాలి ఎదుట మోకాళ్ళపై కూర్చొని ఉంగరంతో ప్రేమను వ్యక్తపరిచారు. ఈ అనూహ్య పరిణామానికి ఆశ్చర్యపోయిన అరుషి, ఆనందంతో బాయ్‌ఫ్రెండ్ ప్రపోజల్‌ను అంగీకరించారు. అక్కడున్న తోటి అధికారులు, కుటుంబ సభ్యులు, శిక్షకులు చప్పట్లతో ఆ జంటను అభినందించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదే విషయంపై కెప్టెన్ భరద్వాజ్ తన అభిప్రాయాన్ని పెంచుకున్నారు. మేమందరం ఈ రోజు పైలెట్లుగా మారాం. మా కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఐదేళ్ళుగా మా ఇద్దరికీ పరిచయం ఉంది. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేయడానికి ఇంతకంటే మంచి రోజు ఉందని భావించాను. ఈ రోజున నా కాబోయే భార్యకు కూడా చిరస్మరణీయంగా మార్చాలనుకున్నా అని ఆయన వివరించారు.
#WATCH | Maharashtra: The passing out parade at the Combat Army Aviation Training School in Nashik, concluded on an emotional note for a couple as Captain Bharat Bhardwaj proposed marriage to his partner. pic.twitter.com/8Un1ZNBP1F
— ANI (@ANI) June 2, 2026
