సోమవారం, 9 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 ఫిబ్రవరి 2026 (16:09 IST)

లవ్ జిహాద్ పేరుతో 300 మంది యువతులపై అత్యాచారం

Love
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. లవ్ జిహాద్, సెక్స్ ట్రాఫికింగ్ రాకెట్ పేరుతో ఏకంగా 300 మంది యువతులపై అత్యాచారం జరిపిన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 300 మందికి పైగా అమాయక యువతులను ప్రేమ పేరుతో మోసం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఒక ముఠా ఆగడాలు బయటపడ్డాయి. 
 
బస్తీ జిల్లాకు చెందిన అజ్ఫరుల్ హక్ అలియాస్ ప్రిన్స్ అనే వ్యక్తి తన అనుచరురతో కలిసి ఒక భారీ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని వారిని ప్రేమ, పెళ్లి పేరుతో లోబరుచుకుని, ఆపై వారిని వ్యభిచార కూవంలోకి నెట్టడమే ఈ ముఠా ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ప్రిన్స్‌ యువతులకు తాను హిందువుగా పరిచయం చేసుకుని ఆ తర్వాత వారికి అనుమానం రాకుండా హిందూ సంప్రదాయం ప్రకారం చేతికి పవిత్ర దారం కట్టుకునేవాడు. ఇలా అనేక మంది అమ్మాయిలను తనవశపరుచుకున్నాడు. 
 
అనేక మందికి మెరుగైన ఉద్యోగాం ఇప్పిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో శారీరకంగా లొంగదీసుకుని, ఆ దృశ్యాలను రహస్యంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడసాగేవాడు. ఆ తర్వాత ఆ యువతులను ఉపాధి పేరుతో నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు వ్యభిచారానికి తరలిస్తున్నట్టు తేలింది. ఈ ఉదంతం వెలుగు చూడటంతో మొత్తం 8 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రిన్స్‌ను ఇప్పటికే అరెస్టు చేయగా, మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.