శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 8 ఏప్రియల్ 2016 (14:25 IST)

బెంగళూరులో ''లా'' యూనివర్శిటీలో దుస్తుల గోల.. విచారణకు రెడీ.. ప్రొఫెసర్‍!‌

బెంగుళూరు 'న్యాయ' విశ్వవిద్యాలయంలో విద్యార్దులకు, ప్రొఫెసర్‌కు మధ్య దుస్తులకు సంబంధించి వివాదం మొదలైంది. ఈ నెల 4వ తేదినా ఓ విద్యార్థిని క్లాస్‌కు షార్ట్ వేసుకుని రావడంతో ప్రొఫెసర్ ఒకరు మండిపడ్డాడు. మహిళా విద్యార్ధినులు తరగతులకు సరైన దుస్తులు ధరించి రావాలని అందరి ముందు వార్నింగ్ ఇచ్చాడు. ఆ ప్రొఫెసర్ చెప్పిన విషయాన్ని అవమానంగా భావించిన సదరు విద్యార్థిని ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చేరవేసింది. 
 
దీంతో అందరూ ప్రొఫెసర్ తీరును అవమానించే విధంగా తప్పుబడుతూ మరుసటి రోజు షార్ట్స్ వేసుకుని క్లాస్‌కు వచ్చారు. తాము ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఒక ప్రొఫెసర్ నిర్ణయించకూడదని, అసభ్యకరంగా మాట్లాడటం సరికాదని విద్యార్థులు నిలదీశారు. తమ దుస్తుల విషయంలో ఆ ప్రొఫెసర్ ముందు నుంచే తమను తప్పుబడుతున్నారని వారు ఆరోపించారు. వీసీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. 
 
అయితే విద్యార్థినులు ధరించే దుస్తులను అన్న మాటలకు ఎలాంటి విచారణ జరిపించుకున్న వారి ముందు సమాధానం చెప్పేందుకు రెడీ అంటూ ప్రొఫెసర్ తేల్చిచెప్పారు. తాను ఎటువంటి విచారణకైన సిద్ధమని ఆ ప్రొఫెసర్ స్పష్టంచేశారు.