బీహార్‌లో ఓ మహిళ సాహసం.. కింగ్ కోబ్రాను మెడలో వేసుకుని... (వీడియో)
బీహార్ ఓ మహిళ అతి పెద్ద సాహసం చేశారు. సాధారణంగా ఓ చిన్నపామును చూస్తేనే ప్రజలు భయంతో పరుగులు తీస్తారు. అలాంటిది ఆ మహిళ ఏకంగా కింగ్ కోబ్రాను పట్టుకుని మెడలో వేసుకుంది. ఆ కింగ్ కోబ్రా ఏకంగా పది అడుగుల పొడవు ఉండటం గమనార్హం. పామును మెడలో స్కార్ఫ్‌లా చుట్టుకుంది. ఈ షాకింగ్ ఘటన చంపారన్ జిల్లాలో జరిగింది.
బీహార్‌కు చెందిన ఆ మహిళ ఒంటరిగా భారీ రాచనాగును పట్టుకుంది. ఆ పామును పట్టుకునే సమయంలో ఆమె ఏమాత్రం భయపడలేదు. ఆ పామును మెడలో వేసుకుని నిలబడింది. అత్యంత ప్రమాదకరమైన పాముతో ఆమె ప్రవర్తించిన తీరు చూసి స్థానికులు నివ్వెరపోయారు. పాము కాటు వేస్తుందన్న భయం కూడా లేకుండా దాన్ని ఓ అలంకరణ వస్తువుగా మెడలో ధరించింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోయారు.
చిన్నపాటి పాముకే భయపడే జనం ఉన్నచోట, అంత పెద్ద కింగ్ కోబ్రాను మెడలో వేసుకోవడం ఆమె ధైర్యానికి నిదర్శనమని కొందరు కొనియాడుతున్నారు. పైగా, ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య అని మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
