గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2016 (11:43 IST)

సీతకు న్యాయం జరగాలని కోర్టులో కేసు: సాక్ష్యాలెక్కడ.. ఎవరిని శిక్షించాలని ప్రశ్నించిన కోర్టు!

బీహార్‌లోని ఓ కోర్టులో సీతారాములు, లక్ష్మణుల కేసు ఆసక్తికరంగా సాగింది. ఈ కేసులో పిటిషనర్ వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ కేసులో ఎవరిని శిక్షించాలని ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. సీతమ్మ ప్రస్తుత బీహార్ రాష్ట్రంలోని మిథిలకు చెందిన అమ్మాయని.. సీతమ్మకు న్యాయం జరగాలని వేడుకుంటున్నట్లు న్యాయవాది ఠాకూర్ చంజన్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

ఏ తప్పూ చేయకుండా రాముడు చెప్పుడు మాటలు విని అడవుల్లో వదిలేశాడని.. ఓ వ్యక్తి సొంత భార్యను ఇలా అడవుల్లో విడిచిరమ్మని చెప్పడం క్రూరమని చెప్పారు. లక్ష్మణుడు కూడా నిజాన్ని గ్రహించకుండా అన్న మాట జవదాటకుండా అడవుల్లో విడిచి వచ్చేశాడని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. 
 
సీతకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కేసు కోర్టులో వేశానని.. ఏ మత నమ్మకాన్ని కించపరిచేందుకు ఇలా చేయలేదన్నారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయమూర్తి, త్రేతాయుగంలో ఈ ఘటన జరిగిందని చెప్పేందుకు గల సాక్ష్యాలేంటని ప్రశ్నించింది. అంతేగాకుండా.. ఈ ఫిర్యాదుకు మూలమేంటని, ఎవరిని శిక్షించాలని ప్రశ్నించారు. దాంతో పాటు కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది.