బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు : ఆధిక్యంలో ఎన్డీయే కూటమి
బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు అధికారులు కౌంటింగ్ చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. 38 జిల్లాల్లోని 46 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఆరంభ ట్రెండ్‌లో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.
కాగా, రెండు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికంగా దాదాపు 67.13 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో విజయం ఎవరిని వరించనుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ.. తుది ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అభివృద్ధి కావాలా? ఆటవిక పాలనా? అంటూ ఎన్డీయే ప్రచార పర్వం కొనసాగించగా.. ఉపాధి, ఓట్ల చోరీ ప్రధాన అంశాలుగా విపక్ష మహాఘఠ్‌బంధన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
బీహార్‌లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు ఎస్టీ, 38 ఎస్సీ రిజర్వ్
అధికారంలోకి రావడానికి కావల్సిన సీట్లు (మ్యాజిక్ ఫిగర్): 122
మొత్తం ఓటర్ల సంఖ్య: 7.45 కోట్లు (పురుషులు 3.92 కోట్ల మంది, మహిళలు 3.50 కోట్ల మంది)