1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Brother goes to bank carrying sister's skeleton on his shoulder, Why? (Video)

సోదరి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకెళ్లిన సోదరుడు, ఎందుకు?, వీడియో

Brother carrying sister skeleton
బ్యాంకు షరతులు ఎలా వుంటాయో చాలామందికి తెలిసిన విషయమే. ముఖ్యంగా డబ్బులు వేసే సంగతి ప్రక్కన పెడితే తీయాలంటే మాత్రం సదరు వ్యక్తి రానిదే డబ్బులు విత్ డ్రా చేయడం దాదాపు దుర్లభం. తన సోదరి చనిపోయిందనీ, ఆమె బాగోగులు తనే చూసుకున్నానని, బ్యాంకులో ఆమె పేరు పైన వున్న డబ్బును తను విత్ డ్రా చేసుకునేందుకు అంగీకరించాలని ఓ వ్యక్తి అభ్యర్థించాడు. ఐతే అందుకు ఆ బ్యాంక్ అంగీకరించలేదు. నీ సోదరి చనిపోయిందన్న గ్యారెంటీ ఏమిటి అని ప్రశ్నించింది. అంతే... ఆ వ్యక్తి తన సోదరి అస్థిపంజరాన్ని తీసుకుని ఏకంగా బ్యాంకుకే వచ్చాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఒడిశాలోని ఓ గ్రామీణ బ్యాంకులో తన సోదరి పేరుపై వున్న రూ. 19,300 డ్రా చేసుకునేందుకు ఆమె సోదరుడు వెళ్లాడు. తన సోదరి చనిపోయిందనీ, అందువల్ల ఆ డబ్బును తనకు ఇప్పించాలని కోరాడు. ఐతే అందుకు బ్యాంకువారు అంగీకరించలేదు. సోదరి చనిపోయిందన్న విషయాన్ని తాము ఎలా నమ్మగలం అంటూ నిబంధనలు మేరకు తాము డబ్బు ఇవ్వలేమని చేతులెత్తేసారు.
 
దాంతో సదరు వ్యక్తి నేరుగా సోదరి అంత్యక్రియలు చేసిన స్మశానానికి వెళ్లాడు. అక్కడ సోదరిని పూడ్చిన గుంతను తవ్వి ఆమె అస్థిపంజరాన్ని గోతాములో చుట్టుకుని ఏకంగా బ్యాంకుకి వెళ్లాడు. అలా సుమారు 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకి వచ్చి తన సోదరి చనిపోయిందంటూ ఆమె అస్థిపంజరాన్ని చూపించాడు. దీనితో బ్యాంకు వారు బెంబేలెత్తిపోయారు. కాగా ఈ ఘటన అక్కడివారిని కలచివేసింది.
 
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ఇరాన్ కండిషన్స్, రంగంలోకి రష్యా, పరిశీలిస్తున్న ట్రంప్