ఆత్మహత్యకు ముందు బ్యూటీ పార్లర్‌లో త్విషా శర్మ.. ఎవరైనా ఇలా చేస్తారా?
TwishaTwisha
ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వివరాలను సెలూన్ యజమాని కిరణ్ పరిహార్ వెల్లడించారు. త్విషా మరణించిన మరుసటి రోజు ఉదయం ఆమె అత్త, రిటైర్డ్ జడ్జి అయిన గిరిబాలా సింగ్ తనకు ఫోన్ చేశారని కిరణ్ తెలిపారు. అలాగే లాయర్లమంటూ వచ్చి గుర్తుతెలియని వ్యక్తులు ఫుటేజ్ తీసుకెళ్లారు. అయితే ఈ ఫుటేజ్ వ్యవహారం ఇంకా పోలీసులకు తెలియకపోవడం గమనార్హం.
కాగా నోయిడాకు చెందిన త్విషా శర్మ, భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్ తనను వరకట్నం కోసం మానసికంగా వేధించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ఆత్మహత్య అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినా, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు రెండోసారి పోస్ట్‌మార్టమ్‌కు అనుమతి ఇచ్చింది.
