శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (15:32 IST)

రామ్ కుమార్‌ది ఆత్మ హత్య కాదు.. హత్యే.. చెన్నై పోలీసులు తీరు సిగ్గు.. సిగ్గు..

స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్ జైలులో ఆత్మహత్యకు పాల్పడటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైలులో గట్టి భద్రత ఉన్న నేపథ్యంలో రామ్ కుమార్ ఆత్మహత్య ఎలా చేసుకున్నాడని కొందరు ప్రశ్నిస్తుంటే.. రా

స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్ జైలులో ఆత్మహత్యకు పాల్పడటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైలులో గట్టి భద్రత ఉన్న నేపథ్యంలో రామ్ కుమార్ ఆత్మహత్య ఎలా చేసుకున్నాడని కొందరు ప్రశ్నిస్తుంటే.. రామ్ కుమార్‌ది ఆత్మహత్య కానే కాదని, హత్యేనని మరికొందరు అంటున్నారు.

తమిళనాట రామ్ కుమార్ ఆత్మహత్యపైనే చర్చ సాగుతోంది. ప్రజలు కూడా రామ్ కుమార్ మరణం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ కుమార్ కుటుంబీకులు కూడా రామ్ కుమార్‌ను పోలీసులే హత్య చేశారంటున్నారు. ఈ వ్యవహారంపై రాజకీయ ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే రామ్ కుమార్ ఆత్మహత్యపై కామెంట్లు, పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
 
ఈ క్రమంలో రామ్ కుమార్ ఆత్మహత్యపై న్యాయవాది సద్గురు ఏమన్నారంటే..? 
రామ్ కుమార్ ఆత్మహత్యకు జైలు అధికారులే బాధ్యత వహించాలన్నారు. రామ్ కుమార్ మరణం.. స్వాతి హత్య కేసును త్వరితగతిన పూర్తి చేయాలన్నదేనని చెప్పారు. ఆత్మహత్య వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పుకొచ్చారు. జైలులో జరిగే ఇలాంటి మర్మ సంఘటనలకు జైలు శాఖ అధికారులే బాధ్యత వహించాలని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండే ఖైదీలు.. జైలులోకి వెళ్తే ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారని ప్రశ్నించారు. జైళ్లలో కరెంట్ తీగలు బయటకు తెలిసేలా వేలాడవని.. గోడ్లలోనే వైరింగ్ చేసివున్నారని చెప్పుకొచ్చారు.  
 
మానవ హక్కుల సంఘం నేత విన్సెంట్ రాజ్ మాట్లాడుతూ.. 
రామ్ కుమార్‌ను జైలులోనే హతమార్చారన్నారు. రామ్ కుమారే స్వాతి హత్య కేసులో నిందితుడని చెప్పేందుకు తగిన సాక్ష్యాలు, ఆధారాలు లేకపోవడంతో, కోర్టు రామ్ కుమార్‌ను నిర్దోషి అని తేల్చేస్తే పోలీసులకు అవమానం తప్పదనే నెపంతోనే పోలీసులు జైలులోనే రామ్ కుమార్ హత్యకు కారణమయ్యారని ఆరోపించారు. అందుకే పోలీసులు జైలులోనే రామ్ కుమార్ ఆత్మహత్య డ్రామాకు తెరలేపారని విమర్శించారు.

జైలులో ఖైదీ ఆత్మహత్యకు పాల్పడే దుస్థితి ఏర్పడటం దారుణం అన్నారు. ఈ ఘటనతో జైలులో అధికారుల తీరు ఎలా వుందో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. కేంద్ర జైలు శాఖ, రాష్ట్ర జైలు శాఖాధికారులు రామ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడేంతవరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పుళల్ జైలు అధికారులపై సస్పెండ్ వేటు వేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు కనుసన్నల్లో సీబీఐ విచారణ కూడా జరిపించాలన్నారు. స్వాతి హత్య కేసులో నిందితుడిని పట్టుకోలేక, సమగ్ర విచారణ జరిపించక దోషికి సరైన శిక్ష పడనీయకుండా ఇలా సూసైడ్ డ్రామాకు పాల్పడిన అసమర్థపు పోలీసుల్ని చూసి సిగ్గుపడుతున్నానని తెలిపారు. 
 
శరవణన్ - పత్రికా విలేకరి ఏమన్నారంటే.. 
అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత పరిపాలనలో ఇలాంటి ఘటనలు జరగలేదంటేనే గొప్పగా చెప్పుకోవాలి. జైలు మొత్తం సీసీటీవీ కెమెరాలున్న నేపథ్యంలో ఏ కెమెరాకు చిక్కకుండా రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంలో పోలీసుల పనితీరు కూడా ఎంతో ఉందని ప్రశంసించారు. రామ్ కుమార్ అనే ఖైదీ స్వాతి కేసులో ప్రధాన నిందితుడని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. అతనికి భద్రత కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇది ఆత్మహత్య కాదని, హత్యేనన్న విషయం తేటతెల్లమవుతుందని చెప్పుకొచ్చారు.

రామ్ కుమార్ ఆత్మహత్య పై అధికారులు, జైలు అధికారుల ప్రమేయం లేకుండా జరిగివుండదని తెలిపారు. ఒకవేళ స్వాతి కేసులో రామ్ కుమార్ నిందితుడని తేలితే పది సంవత్సరాలో లేకుంటే 14 సంవత్సరాల జైలు శిక్షకు అనంతరం.. విడుదలై మంచి మనిషిగా మారైనా జీవితం సాగించేవాడని.. కానీ పోలీసులు ఏకంగా తిరిగి రాని లోకానికి పంపించారు.
మీడియా పర్సన్.. సాయిరామ్
రామ్ కుమార్ ఆత్మహత్య ద్వారా స్వాతి హత్యకేసు కథ కంచికెళ్ళినట్టే. దేశ వ్యాప్తంగా స్వాతి హత్య కేసు నిందితుడు ఎవరని ఎదురుచూస్తుంటే.. రామ్ కుమారే స్వాతి హత్య కేసు నిందితుడంటే నమ్మాం.. గొంతుకోసుకున్నాడంటే నమ్మాం.. ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్నాడంటేనూ నమ్ముతున్నామంటూ ఎద్దేవా చేశారు.