1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. CJP founder Abhijeet Dipke slapped multiple times, beaten before addressing crowd in Jaipur

కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్‌ చెంప ఛెళ్లుమనిపించిన దండగుడు (వీడియో)

Abhijeet Dipke
దేశ వ్యాప్తంగా సంచనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దిప్కేపై గుర్తు తెలియని ఓ దండగుడు దాడికి పాల్పడ్డాడు. జైపూర్‌లో ఈ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు అభిజీత్ రాగా, ఆయన చెంపపై పలుమార్లు కొట్టాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
అయితే, భౌతిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఆ పార్టీ కార్యకర్తలు పట్టుకుని చితకబాది ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అయితే, ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యం, దాడి చేసిన వ్యక్తి ఎవరు తదితర వివరాలు తెలియాల్సివుంది. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్న ఒక్క చిన్నమాటతో సోషల్ మీడియా నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిన విషయం తెల్సిందే. 
 
ఈ పార్టీ ప్రారంభించిన అనతికాలంలోనే ఈ పార్టీకి కోట్లాది మంది యువత సభ్యులుగా చేశారు. ఆ తర్వాత నీట్‌, సీబీఎస్ఈ వంటి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలంటూ దేశ వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టింది. తొలుత ఢిల్లీలో ఆందోళన చేసిన ఈ పార్టీ ఆ తర్వాత బెంగుళూరులో ఆందోళన చేయగా, పలువురు సినీ ప్రముఖులు సైతం మద్దతు పలికారు. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి