1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. CM Vijay to fly to New Delhi on Wednesday, to call on PM Modi

ముఖ్యమంత్రి హోదాలో హస్తినకు విజయ్ ... నేడు ప్రధానితో భేటీ

tn cm vijay
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సినీ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ బుధవారం హస్తినకు వెళుతున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలపై వారితో చర్చించనున్నారు. 
 
తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అదనపు ఆర్థిక సాయం అందించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రాజెక్టులకు, అభివృద్ధి ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని కోరనున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం ఉదయమే ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ భేటీల తర్వాత ఆయన రాత్రికి తిరిగి చెన్నైకు చేరుకుంటారు. 
 
ఈ పర్యటనలో ముఖ్యంగా, తమిళనాడు ఆర్థిక పురోభివృద్ధికి అత్యంత కీలకమైన పారిశ్రామిక వృద్ధి రంగాలు, సంక్షేమ పథకాలు, కనెక్టివిటీ ప్రాజెక్టులతో పాటు మౌలిక వసతుల విస్తరణకు కేంద్రం నుంచి గట్టి మద్దతు లభించేలా ముఖ్యమంత్రి విజయ్ ఈ పర్యటనలో చొరవ తీసుకోనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక కేటాయింపులను సాధించుకోవడమే లక్ష్యంగా సీఎం విజయ్ తన తొలి పర్యటను కొనసాగించనున్నారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కర్నాటక కాంగ్రెస్‌లోఅనూహ్య పరిణామాలు : సీఎం పదవికి రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య...?