1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Cockroach Party Plans Hyderabad Protest at Dharna Chowk on June 14

హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా

Cockroach Party
Cockroach Party
విద్యా వ్యవస్థలోని సమస్యలను ఎత్తిచూపే తమ ప్రచారంలో భాగంగా, కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వరుస శాంతియుత నిరసనలను ప్రకటించింది. తమ సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, జూన్ 14న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌లో మరో నిరసన ప్రదర్శనను నిర్వహించనున్నారు. 
 
ఈ నిరసనలు జూన్ 15న జైపూర్‌లోని షహీద్ స్మారక్ వద్ద మధ్యాహ్నం 3 గంటలకు కొనసాగుతాయి. ఆ తర్వాత జూన్ 20న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం ఉంటుంది. పూణెలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ డిప్కే మాట్లాడుతూ, ఈ ఉద్యమ ప్రారంభంతో పాటు తమ విద్యా విధాన ప్రకటన పత్రాన్ని (ఎడ్యుకేషన్ మేనిఫెస్టో) కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. 
 
సావిత్రిబాయి పూణె యూనివర్సిటీ వద్ద మా దేశవ్యాప్త నిరసనను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ నిరసన శాంతియుతంగా, రాజ్యాంగ పరిధికి లోబడి ఉంటుంది. ఇందులో భాగంగా మా విద్యా విధాన ప్రకటన పత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీల నివారణ, సకాలంలో ఫలితాల ప్రకటన, నియామకాలు, ప్రవేశ పరీక్షలలో పారదర్శకత, పరీక్షా అధికారుల జవాబుదారీతనం పెంచడం వంటి ఇటీవలి సంవత్సరాలలో విద్యార్థులు లేవనెత్తిన కీలక ఆందోళనలను ఈ మేనిఫెస్టో పరిష్కరిస్తుందని దీప్కే పేర్కొన్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
పెళ్లైనా మరో యువకుడితో కుమార్తె: శ్రీకాకుళం తీసుకెళ్లి చంపేసిన తల్లి, తాతయ్య, వీడియో