1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Cockroaches destroyed PM’s public image in just 2 weeks : Arundhati Roy on CJP Protest in Jantar Mantar, Delhi

24 యేళ్ళు శ్రమించి మోడీ నిర్మించుకున్న ఇమేజీ 2 వారాల్లో ధ్వంసమైంది : అరుంధతీ రాయ్

arundhati roy
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 24 యేళ్లుగా శ్రమించి నిర్మించుకున్న ఇమేజీ రెండు వారాల్లో ధ్వంసమైందని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ అన్నారు. మోదీ 24 ఏళ్లుగా నిర్మించుకున్న ఇమేజీ రెండు వారాల్లో ధ్వంసమైంది. తన తల్లి మేరీరాయ్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ అరుంధతీ రాయ్ రాసిన 'మదర్ మేరీ కమ్స్ టు మీ' పుస్తకం హిందీ అనువాదం 'మెరీ మా, మెరీ గ్యాంగ్ స్టర్' ఆవిష్కరణ సభ ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటరులో జరిగింది. సభికులతో కిక్కిరిసిన ఆ సభను ఉద్దేశించి ఆరుంధతి మాట్లాడారు. 'మనకుగానీ, దేశానికి గానీ ఏం జరగబోతోందో ఎవరికీ తెలియని సమయం. స్క్రిప్టు పూర్తిగా రాసేశారు. ఈ పరిస్థితుల్లోనే మరో వెయ్యేళ్లు బతకాల్సి ఉంటుందని జనం నమ్మసాగారు, కానీ, రెండు వారాల్లోనే ఈ పరిస్థితులు మూలాల నుంచి కదిలిపోయాయి. 
 
కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ, కనీసం ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించకుండా 24 సంవత్సరాలుగా రూపొందించుకున్న(మోడీ) ఇమేజీని, ఆయన ఏకంగా విష్ణువు అవతారం అని కొందరు చెబుతున్న సమయంలో బొద్దింకలు రెండు వారాల్లో ధ్వంసం చేశాయి అని ఆరుంధతి రాయ్ అన్నారు. యువత ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించిందని, ఎంతో పరిపక్వత చూపిందని పేర్కొన్నారు. జంతర్ మంతర్ నిరసనల నుంచి ప్రతిపక్షాలు పాఠాలు నేర్చుకోవాలని అరుంధతీ రాయ్ పేర్కొన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హర్మూజ్ జలసంధి : ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా