సంబంధిత వార్తలు
- ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు
- తూఛ్... సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పలేదు : ఉదయనిధి స్టాలిన్
- 144 ఓట్లతో బలపరీక్షలో నెగ్గిన విజయ్.. టీవీకేకు ఓటేసిన అన్నాడీఎంకే రెబల్ వేలుమణి
- సనాతన ధర్మాన్ని కరోనాతో పోల్చిన ఉదయనిధి స్టాలిన్ ఆలయాల చుట్టూ తిరుగుతున్నారే?
- Prakash Raj: ప్రకాశ్ రాజ్ కు మాత్రుమూర్తి సువర్ణలత వియోగం
కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్
కాంగ్రెస్ పార్టీపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని, నమ్మక ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. గత రెండు దశాబ్దాలుగా తమపై ఆధాకపడిన కాంగ్రెస్ ఇపుడు అధికారం కోసం టీవీకేతో చేతులు కలిపిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ఎవరూ ఎప్పటికీ మర్చిపోవద్దని.. ఆ పార్టీ నేతలను భవిష్యత్తులో తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని సూచించారు. రాజకీయంగా తన ఉనికిని నిలుపుకోవడానికి కాంగ్రెస్ ఎంతటి దారుణానికి అయినా ఒడిగడుతుందని మరోసారి రుజువయ్యిందన్నారు.
దేశంలో భారతయ జనతా పార్టీ వరుస విజయాలకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలే ప్రధాన కారణమని తాను ఇన్నాళ్లు భావించానని.. కానీ అది నిజం కాదని ఉదయనిధి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల అసమర్థత వల్లే ప్రజలు భాజపాకు పట్టం కడుతున్నారని.. అది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. డీఎంకేతో పొత్తు వల్లే గతంలో కాంగ్రెస్‌కు రాజ్యసభ ఎంపీ, అసెంబ్లీ సీట్లు వచ్చాయన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా డీఎంకే కార్యకర్తల అవిశ్రాంత కృషి వల్లే ఆ పార్టీ ఐదు సీట్లు గెలుచుకోగలిగిందన్నారు. ఆ విశ్వాసం కూడా లేకుండా కాంగ్రెస్ నేతలు గెలిచిన వెంటనే అధికారం కోసం పరుగులు తీశారని మండిపడ్డారు. త్వరలోనే తమిళనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎన్నికల్లో డీఎంకే పరాజయం నేపథ్యంలో అంతర్గత పార్టీ వ్యూహాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు.
