1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Dad didn't allow Jio-to-Airtel port request': Bengaluru techie who stabbed parents to death mentally sound, say cops

జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్ చేయిస్తానంటే అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య!

murder
జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్ చేయిస్తానంట ఒప్పుకోలేదని తల్లిదండ్రులను ఓ టెక్కీ హత్యకు చేశాడు. బెంగుళూరులో జరిగిన ఈ ఘోరం వెనుక అసలు కారణం తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కేవలం ఒక సిమ్ పోర్టింగ్ వివాదం. స్టార్టప్ డబ్బుల గొడవ చివరకు కన్న తల్లిదండ్రుల దారుణ హత్యలకు దారితీసింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ హత్యలకు సంబంధించిన కారణాలను పోలీసుల తాజాగా వెల్లడించారు. 
 
సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్‌ రోహాన్ తన జియో నంబరును ఎయిర్‌టెల్‌కు మార్చుకోవాలని భావించాడు. కానీ, విశ్రాంతి నావికాదళం అధికారి అయిన అతడి తండ్రి అందుకు అంగీకరించలేదు. ఫిబ్రవరి 11వ తేదీన ఈ చిన్న విషయంపైనే తండ్రీకొడుకుల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. చివరకు కన్నవారి హత్యకు దారితీసింది. 
 
అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివిన రోహాన్.. ఒక సొంత స్టార్టప్ పెట్టాలనుకున్నాడు. అందుకోసం తండ్రిని రూ.10 లక్షలు అడిగాడు. కానీ, ముందు ఉద్యోగం చూసుకోమంటూ తండ్రి ఆ డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. సిమ్ కార్డు గొడవతో పాటు ఈ ఆర్థిక ఇబ్బంది కూడా అతడిలో కోపాన్ని పెంచింది. 
 
కన్నవారిని కత్తులతో పొడిచి చంపిన రోహాన్‌కు మానసిక జట్టు ఉందమోనని పోలీసులు అనుమానించారు. గతంలో అతడి తల్లి కూడా పొరుగువారితో ఇదే విషయం చెప్పింది. దీంతో పోలీసులు అతడిని నిమ్హాన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారం రోజుల పరీక్షల తర్వాత రోహన్‌కు ఎలాంటి మానసిక సమస్యలు లేవని డాక్టర్లు తేల్చేశారు. 
 
పోలీసులు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో కీలక ఆధారాలు ఉంచారు. ఘటనా స్థలంలో దొరికిన రక్తం మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించారు. రోహన్ బట్టలపై ఉన్న రక్తం అతడి తల్లిదండ్రులదేనని ల్యాబ్ రిపోర్టులో స్పష్టమైంది. సుమారు 40 మంది సాక్షుల స్టేట్మెంట్లతో పోలీసులు నిందితుడిపై పక్కా ఆధారాలు సేకరించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రైతులు వేధింపులకు గురువుతున్నారు.. అమరావతిలో జగన్ భేటీ