గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (15:33 IST)

కత్రినా, దీపికల్లో ఎవరు పొడవు? ఎస్ఎస్‌సీ పేపర్లో ఇదేం ప్రశ్నరా బాబు?

బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, దీపిక పడుకొనేల్లో ఎవరు పొడవు? అనే ప్రశ్న ఎస్ఎస్‌సీ పేపర్లో కనిపించింది. ప్రశ్న: ఈ క్రిందివారిలో ఎవరు పొడవు? ఆప్షన్లు: 1. హుమా ఖురేషీ, 2. కత్రినా కైఫ్, 3. దీపికా పడుకొనే, 4. ప్రీతీజింటా. ఇదేదో సినిమా క్విజ్ అనుకుంటే పొరపాటే. ఈ ప్రశ్నను కేరళలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌‍సి) పరీక్ష ప్రశ్నాపత్రంలో ఇచ్చారు. 
 
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్ష రాసేవారు ఈ ప్రశ్నను చూసి అవాక్కయ్యారు. కేంద్ర మంత్రిత్వశాఖల్లో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల నియామకానికి నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న వుండటం సంచలనం సృష్టించింది. దీనిపట్ల ఎస్ఎస్‌సి చైర్మన్ ఎ భట్టాచార్య విచారం వ్యక్తం చేశారు. 
 
ఉమ్మడి గ్రాడ్యుయెట్ స్థాయి పరీక్షలో ఇలాంటి ప్రశ్న ఇవ్వడం లైంగిక వివక్ష అంటూ కేరళ మహిళా కమిషన్ ఫైర్ అయ్యింది. ఈ ప్రశ్నాపత్రంలోనే మహిళలందరూ పిల్లులు, అన్ని పిల్లులు ఎలుకలు అనేవిధంగా ఓ ప్రశ్న వున్నట్టు కేరళ మహిళా కమిషన్ విమర్శిస్తోంది.