సంబంధిత వార్తలు
- విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)
- రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు
- ఏలూరులో దారుణం.. ఇద్దరు వృద్ధ మహిళల సజీవదహనం
- అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భర్తను హత్య చేయించిన భార్య
- ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్
లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం - 21 మంది మృతి
దేశ రాజధాని ఢిల్లీలో మాలవీయ నగర్‌లో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో కూడా పలువురు విదేశీయులు ఉన్నారు. అలాగే, ఈ ప్రమాదం నుంచి మరికొందరిని స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. మరికొంతమంది చిక్కుకొని ఉంటారని సమాచారం.
హౌజ్‌రానీ ప్రాంతంలో ఉదయం 8.50 గంటల సమయంలో రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
'తొలుత చిన్నగా మొదలైన మంటలు.. తర్వాత వేగంగా వ్యాపించాయి. దాంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే మార్గం లేకుండా పోయింది. పైనున్నవారు కిందికి దూకినా ఎలాంటి దెబ్బలు తగలకుండా ఉండేందుకు స్థానికులు పరుపులు పరిచారు. మూడో అంతస్తు నుంచి ఒక మహిళ చిన్నారితో సహా కిందికి దూకింది' అని ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు వెల్లడించారు.
ఉదయం తాను ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయడానికి ప్రయత్నించగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ఆ రెస్టారెంట్‌లో పనిచేసే చెఫ్ కేసర్ సింగ్ వెల్లడించారు. వెంటనే హోటల్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. 'నేను బయటకు వచ్చి చూస్తే.. హోటల్ మొత్తం మంటల్లో చిక్కుకొని కనిపించింది' అని చెప్పారు. ఈ హోటల్‌లో బస చేసిన విదేశీయులు సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా నుంచి చికిత్స కోసం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటన బాధితులకు అన్నిరకాల సహాయం చేస్తామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి చికిత్స నిమిత్తం రూ.50 వేల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.
