1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Delhi Newlywed Akriti Suthar Found Dead, Family Alleges Dowry Murder

పెళ్లైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య.. గూగుల్‌లో సెర్చ్ చేసి?

Crime news
Crime news
పెళ్లైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు వరకట్నం వేధింపులే కారణమని పోలీసుల విచారణలో తెలిసింది. ఆత్మహత్యకు ముందు ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అనే అంశంపై గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసులు జరిపిన దర్యాప్తులో తెలిసింది. 
 
వివరాల్లోకి వెళితే... దేశ రాజధాని ఢిల్లీ, లోధి కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆకృతి సుతార్‌ (28) అనే యువతి మృతి చెందిన కేసులో పోలీసులు జరిపిన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించి వివాహం చేసుకున్న రెండు నెలలకే ఆమె తనువు చాలించింది. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి భర్త అరస్తు సిక్కాను అధికారికంగా అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. అదనపు కట్నం తీసుకురాలేదనే నెపంతో భర్త అరస్తు సిక్కా తన కూతురిని పెళ్లయిన నాటి నుంచి నిత్యం మానసికంగా, శారీరకంగా వేధించేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి తర్వాత ఆమెపై ఒత్తిడి తెస్తూ రూ.10 లక్షల నగదుతో పాటు ఒక కొత్త కారును కట్నంగా డిమాండ్ చేసినట్లు వారు తమ ఫిర్యాదులో ఆరోపించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
వయనాడ్‌లో కొండ చరియల బీభత్సం - శిథిలాల కింద ప్రజలు