సంబంధిత వార్తలు
- కర్నాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం
- కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్‌కు ఆశీస్సులు
- సిద్ధరామయ్య ఇంట్లో అల్పాహార సమావేశం.. కావేరికి చేరిన డీకే శివకుమార్
- కర్నాటక కాంగ్రెస్‌లోఅనూహ్య పరిణామాలు : సీఎం పదవికి రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య...?
- అన్నాడీఎంకే ఎన్నికల హామీలు : ఉచిత బంగారం - ఇంటికో ఫ్రిజ్ - పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం
కర్నాటక ప్రజలపై సీఎం డీకే శివకుమార్ వరాల జల్లు
కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమారు బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీఎం కుర్చీలో కూర్చోగానే ఆ రాష్ట్ర ప్రజలపై వర్షాలు కురిపించారు. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన, ముఖ్యంగా విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని వరాల జల్లు కురిపించారు. ఈ నెల 3వ తేదీన బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్‌లో పార్టీ నేతలు, మత పెద్దల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. అధికారంలోకి వస్తూనే, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు అందిస్తామని తొలి కీలక ప్రకటన చేసి విద్యార్థులకు శుభవార్త అందించారు.
గతంలో ఉప ముఖ్యమంత్రిగా, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో డీకే శివకుమార్ 'బ్రాండ్ బెంగళూరు' నినాదంతో ముందుకు వెళ్తున్నారు. నగరంలో దీర్ఘకాలంగా ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. అదేసమయంలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ప్రజలకు అనేక హామీలు, పథకాలు ప్రకటించారు.
ఉచిత బస్ పాసులు : రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగాలు : జాబ్ కాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. సుమారు 50,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దీనిపై తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ప్రైవేట్ ఉపాధి. కర్ణాటక యువతకు ప్రాధాన్యతనిస్తూ నైపుణ్య శిక్షణతో కూడిన ప్రైవేట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.
యువక సంఘాలు : క్రీడలు, సంస్కృతి, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,000 'భారత్ జోడో యువక సంఘాల'ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి సంఘానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు.
రోడ్ల అభివృద్ధి : గుంతలు, ట్రాఫిక్ సతమతమవుతున్న బెంగళూరులో రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి కోసం రూ.2,000 కోట్లు కేటాయించారు.
నిర్మాణాల క్రమబద్ధీకరణ : నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. 2,500 చదరపు అడుగుల లోపు ఉన్న ఆస్తులకు వన్-టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు.
