1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Doctor Assault Caught on Camera: FIR Filed Against Shiv Sena Corporator Ramesh Mhatre

పిల్లల ఐసీయూ బెడ్స్ ఖాళీలేవన్న సిబ్బంది.. శివసేన కార్పొరేటర్ పిడుగుద్దులు (వీడియో)

ramesh mathre
మహారాష్ట్రలోని థానేలో ఓ కార్పొరేటర్ రమేశ్ మాత్రే తన అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు. డోంబివలి ఆస్పత్రిలోని  చిన్నపిల్లల ఐసీయూ వార్డులో బెడ్‌లు ఖాళీ లేవని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన శివసేన పార్టీ షిండే వర్గానికి చెందిన కార్పొరేటర్ ఆస్పత్రి సిబ్బందిపై ఆడామగా అనే తేడా కూడా చూడకుండా దాడికి పాల్పడ్డాడు. అతనితో పాటు అతని అనుచరులు కూడా దాడి చేసి ఆస్పత్రి సిబ్బందిని చితకబాదారు. 
 
పిల్లల ఐసీయూ బెడ్లు ఖాళీగా లేవనే కారణంతో అక్కడి సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ క్రమంలో ఒక మహిళా గైనకాలజిస్ట్‌పైనా కూడా ఆయన చేయిచేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో కలకలం రేగింది. ప్రాణాలు కాపాడే వైద్యులపై ఇలాంటి దాడులు చేయడమేంటని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యాల్లో వైరల్‌గా మారింది. బీజేపీ పార్టీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ఉండగా, శివసేన షిండే వర్గానికి చెందిన ఏక్‌నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన వర్గానికి చెందిన కార్పొరేటర్  విచక్షణ మరిచిపోయి ఆస్పత్రి సిబ్బందిపై దాడికి పాల్పడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి భర్త ఆత్మహత్యాయత్నం