1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Eat these almonds, it will remind you of my file: Victim scatters almonds on official-s desk

ఈ బాదం పప్పులు తినండి, నా ఫైల్ గుర్తొస్తుంది: అధికారిణి టేబుల్ పైన బాదం పోసిన బాధితుడు

Victim scatters almonds
నాకు మీ ఫైల్ ఇచ్చారా... గుర్తులేదే, చూస్తాను అని గత కొన్ని నెలలుగా తనకు సమాధానంగా చెబుతున్న అధికారిణి తీరుపై ఓ వ్యక్తి తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. తన అసహనాన్ని వినూత్నంగా తెలియజేసాడు. నేరుగా కార్యాలయంలోని అధికారిణి టేబుల్ వద్దకు వెళ్లాడు. తన ఫైల్ క్లియరెన్స్ గూర్చి మరోసారి అఢిగాడు. ఎప్పటిలాగానే ఆమె ఆ ఫైల్ గుర్తులేదు అని చెప్పేసరికి తనతో తెచ్చుకున్న బాదం పప్పులను టేబుల్ పైన పారబోసాడు.
 
ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో జరిగింది. హౌసింగ్ బోర్డులో తన ఇంటికి సంబంధించి ఓ పని కోసం గత కొన్ని నెలలుగా బాధితుడు తిరుగుతున్నాడు. ఐనా పని జరగకపోవడమే కాకుండా అక్కడ వున్న అధికారిణి సమాధానం, ఫైల్ ఎప్పుడు ఇచ్చారో గుర్తులేదు అనడంతో అతడు తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన చేతిలో వున్న బాదం పప్పులను ఆమె టేబుల్ పైన పోసి.. ఇవి తింటేనైనా మీకు జ్ఞాపక శక్తి వస్తుందేమో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
 
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
మహిళా బిల్లు.. రెండూ పార్టీలూ మోసం చేశాయ్.. ఎన్నికల్లో పోటీ చేయండి.. కవిత పిలుపు