గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 జనవరి 2026 (15:06 IST)

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

dk shiva kumar
కర్నాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై మరోమారు చర్చమొదలైంది. ఈ పరిణామాల వేళ కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన పోస్ట్ మరించి చర్చనీయాంశంగా మారింది. 'ప్రయత్నాలు విఫలమైనా.. ప్రార్థనలు ఎన్నటికీ విఫలం కావు' అంటూ డీకే తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు. దీంతో సీఎం మార్పుపైనే ఆయన పరోక్షంగా మాట్లాడారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
 
రాహుల్‌ గాంధీ మంగళవారం మైసూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తదితర నేతలతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్రంలో అధికార పంపిణీ వ్యవహారంపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పష్టతనివ్వాలని ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య.. రాహుల్‌ గాంధీని కోరినట్లు సమాచారం. 
 
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారని అప్పట్లో వార్తలూ వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలను ఖండిస్తూ ఐదేళ్లూ తానే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య పలుమార్లు స్పష్టం చేశారు.