సంబంధిత వార్తలు
- ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు
- క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి
- అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...
- Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?
- ఒంటరి మహిళపై అత్యాచారం - సీఐ పరారీ... ఆచూకీ కనిపెట్టని పోలీసులు
పెళ్లికి నిరాకరించిన మహిళ - బాలుడిని నేలకేసి కొట్టి చంపేసిన కిరాతకుడు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. మనస్పర్థల కారణంగా తన బిడ్డతో కలిసి భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ పెళ్లికి నిరాకరించింది. దీన్ని జీర్ణించుకోలేని ఓ యుకుడు ఆ మహిళ కుమారుడిని నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ భయానక దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా, ఈ వీడియో దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
ఫిరోజాబాద్‌కు చెందిన రతిదేవి (40) అనే మహిళ టీచర్‌గా ఉద్యోగం చేస్తూ భర్త నుంచి విడిపోయి, తన యేడాదిన్నర కుమారుడు ఆరవ్‌తో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. భర్తతో విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ విషయంలో ఆమెకు సాయం చేస్తానని జితేంద్ర్ అలియాస్ విరాజ్ ఆమెకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఆ వివాహితపై మనసు పారేసుకున్న విరాజ్.. తన మనసులో మాట ఆమెకు చెప్పి, వివాహ ప్రతిపాదన చేశాడు. అయితే, ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా పెళ్లికి అంగీకరించడంతో రతిదేవిపై విరాజ్ పగ పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే చాక్లెట్ కొనిస్తానని చెప్పి, రతిదేవి కొడుకు ఆరవ్‌ను బయటకు తీసుకెళ్లిన విరాజ్... ఇంటికి 50 మీటర్ల దూరంలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి, ఆ చిన్నారిని పదేపదే నేలకేసి ఘోరంగా కొట్టాడు. బాలుడు గుక్కపెట్టి ఏడుస్తున్నా ఏమాత్రం కనికరించకుండా మానవ మృగంలా నేలకేసి కొట్టాడు. ఆ బాలుడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని రతిదేవి ఇంటివద్ద పడేసి పారిపోయాడు.
దీన్ని రతిదేవి కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆరవ్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేశారు.
పెళ్లికి నిరాకరించిందని.. చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన దుర్మార్గుడు
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 31, 2026
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో వెలుగు చూసిన ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన
టీచర్‌గా ఉద్యోగం చేస్తూ.. భర్త నుంచి విడిచిపోయి.. పేరెంట్స్ వద్ద ఏడాదిన్నర కొడుకు ఆరవ్‌తో ఉంటున్న రతిదేవి (24)
భర్తతో విడాకుల కోసం… pic.twitter.com/yFhV2cV0F8
