ప్రధాని చేతుల మీదుగా తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం, ఏమిటి దీని ప్రత్యేకతలు?
పర్యావరణ కాలుష్యం నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో మోడీ సర్కార్ భారతీయ రైల్వేలలో మరో ముందడుగు వేసింది. పర్యావరణహితమైన హైడ్రోజన్ రైలుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. హరియాణాలోని జింద్ రైల్వే స్టేషను నుంచి సోనిపత్ వరకూ 89 కిలోమీటర్ల మేర ఈ రైలు ప్రయాణిస్తుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 2600 మంది ప్రయాణం చేయవచ్చు. హైడ్రోజన్ రైలు ప్రత్యేకలు ఏమిటో తెలుసుకుందాము. హైడ్రోజన్ రైలు (Hydrogen Train) అనేది ప్రపంచ రైల్వే రవాణా రంగంలో, పర్యావరణ పరిరక్షణలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణ. సాంప్రదాయ డీజిల్ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా, పర్యావరణానికి ఎలాంటి హాని చేయని సాంకేతికతతో ఇవి పనిచేస్తాయి.
హైడ్రోజన్ రైళ్ల అత్యంత పెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇవి 100% పర్యావరణ హితమైనవి. సాధారణ డీజిల్ రైళ్లు విపరీతమైన కార్బన్ డైయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ మరియు పొగను విడుదల చేస్తాయి. కానీ, హైడ్రోజన్ రైలు నడిచేటప్పుడు ఎలాంటి హానికరమైన వాయువులు విడుదల కావు. దీని సైలెన్సర్ నుండి కేవలం నీటి ఆవిరి, నీరు మాత్రమే బయటకు వస్తాయి.
ఈ రైళ్లు పనిచేసే విధానం చాలా ఆధునికమైనదిగా వుంటుంది. రైలు పైభాగంలో అమర్చిన ఫ్యూయల్ సెల్స్‌లోకి హైడ్రోజన్ ఇంధనాన్ని పంపుతారు. ఈ హైడ్రోజన్ గాలిలోని ఆక్సిజన్‌తో రసాయన చర్య జరిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్ ద్వారా రైలులోని మోటార్లు పనిచేస్తాయి. అలాగే మిగిలిన అదనపు విద్యుత్‌ను రైలులో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలలో భద్రపరుస్తారు.
ఈ రైలు శబ్దం లేని ప్రయాణం ఇస్తుంది. డీజిల్ ఇంజన్లతో పోలిస్తే హైడ్రోజన్ ఇంజన్లు చాలా నిశ్శబ్దంగా పనిచేస్తాయి. ఇంజన్ నడుస్తున్నప్పుడు వచ్చే ప్రకంపనలు , కర్ణకఠోరమైన శబ్దాలు ఇందులో ఉండవు. దీనివల్ల ప్రయాణికులకు అత్యంత ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన ప్రయాణ అనుభూతి కలుగుతుంది. ఒకసారి హైడ్రోజన్ ట్యాంక్ పూర్తిగా నింపితే, ఈ రైళ్లు సుమారు 600 నుండి 1000 కిలోమీటర్ల దూరం వరకు నిరంతరాయంగా ప్రయాణించగలవు. ఇవి గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
సాధారణ ఎలక్ట్రిక్ బ్యాటరీలతో నడిచే వాహనాలను ఛార్జ్ చేయడానికి గంటల సమయం పడుతుంది. కానీ హైడ్రోజన్ రైళ్లలో ఇంధనాన్ని నింపడం చాలా సులభం. డీజిల్ కొట్టినట్లే కేవలం 20 నుండి 30 నిమిషాల వ్యవధిలోనే రైలు ట్యాంకులను పూర్తిగా హైడ్రోజన్ గ్యాస్‌తో నింపేయవచ్చు.
भारत की पहली हाइड्रोजन ट्रेन अब पटरी पर...
— Shobhit Sharma (@helloshobhit) July 17, 2026
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में भारतीय रेलवे भविष्य की तकनीक और स्वच्छ ऊर्जा के साथ नए भारत की दिशा तय कर रहा है।@PMOIndia @RailMinIndia #Hydrogen_train pic.twitter.com/dK4LQqZivF
