గురువారం, 12 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 ఫిబ్రవరి 2026 (15:40 IST)

కొరియన్లంటే ఇష్టం.. ఇక్కడి వాళ్లను పెళ్లి చేసుకోలేం : అక్కాచెల్లెళ్ల డైరీ నోట్

three sisters
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఆత్మహత్య కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆన్‌లైన్ గేమ్‌కు బానిసలైన తమ కుమార్తెల నుంచి మొబైల్ ఫోన్లను తండ్రి తీసేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు తొమ్మిదో అంతస్తు నుంచి దూకేసి ప్రాణాలు తీసుకున్నారు. నిషిక (16), ప్రాచి (14), పఖీ (12) అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు బుధవారం బలవన్మరణానికి పాల్పడిన విషయం తెల్సిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. 
 
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు కొరియన్ అంటే చాలా ఇష్టమని, సోషల్ మీడియాలో తమ ఖాతాలను కూడా కొరియన్ పేర్లతో తెరిచినట్టు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు పది రోజుల ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తండ్రి డిలీట్ చేశారు. వీరి ముగ్గురు మరియా, అలీజా, సిండీ అనే కొరియన్ పేర్లతో ఖాతాలను తెరిచారు. ఇంట్లో కూడా వారు అవే పేర్లతో పిలుచుకునేవారు. ఇటీవల తండ్రి ఆ ఖాతాలను డిలీల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. 
 
వారి వద్ద నుంచి తండ్రి మొబైల్ ఫోన్లు కూడా తీసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. సోషల్ మీడియా ఖాతాలకు డిలీట్ చేయడం, తమ వద్ద ఫోన్లు లేకుండా చేయడంతో వారు ముగ్గురు తీవ్ర మనస్తాపానికి లోనై ఈ దారుణానికి పాల్పడ్డాడరని పోలీసులు భావిస్తున్నారు. పైగా, తమకు కొరియన్ అంటే ప్రాణమని, ఈ విషయం మీకు అర్థం కాదని, ఇక్కడి వాళ్లను మేం పెళ్లి చేసుకోలేమని డైరీలో ముగ్గురు అమ్మాయిలు రాసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.