సోమవారం, 16 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఫిబ్రవరి 2026 (22:07 IST)

భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అమ్మేసిన భార్య.. అలా సెటిలైపోయింది..

Wedding
ఓ సినిమాలో భర్తను ఓ భార్య కోటి రూపాయలకు అమ్మేస్తుంది. ఇదే తరహాలో ప్రస్తుతం రియల్ లైఫ్‌లో జరిగింది.  తన భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అప్పగించింది. వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల క్రితం ఓ భార్యాభర్తలకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆయనకు 42 ఏళ్లు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 
 
అయితే, తన భర్త ఆయనతో పాటు పని చేస్తున్న 54 ఏళ్ల మహిళతో సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు ముగ్గురినీ కౌన్సెలింగ్‌కు పిలిచింది. భర్త ఆమెతోనే వుంటానని స్పష్టం చేశాడు. దీంతో భార్య అతని ప్రియురాలికి వదిలిపెట్టడానికి రూ.1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రియురాలు అంగీకరించడంతో ఒప్పందం జరిగింది. 
Girlfriend
Girlfriend
 
భార్యకు ఒక డూప్లెక్స్ ఇల్లు ఇవ్వడంతో పాటు, రూ.27లక్షల నగదు చెల్లించారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లో స్థిరపడేందుకు సిద్ధమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.