శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 13 జులై 2016 (13:15 IST)

శునకాల తర్వాత మేకలే మనుషులకు మంచి స్నేహితులు..!

మానవుల్లో భావోద్వేగం ఉంటుంది సరేకానీ జంతువుల్లోనూ అంతర్గతంగా భావ సారూప్యత ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. మానవులు ఎలా భావోద్వేగాలకు గురవుతారో అదే తరహాలో మేకలు, శునకాలు కూడా స్పందిస్తాయని తాజా పరిశోధన

మానవుల్లో భావోద్వేగం ఉంటుంది సరేకానీ జంతువుల్లోనూ అంతర్గతంగా భావ సారూప్యత ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. మానవులు ఎలా భావోద్వేగాలకు గురవుతారో అదే తరహాలో మేకలు, శునకాలు కూడా స్పందిస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీంతో మానవునికి మాట్లాడేశక్తి ఉన్నప్పటికీ.. ఇతర జీవుల పట్ల స్పందించే గుణం జంతువులకు కూడా ఉంటుంది. 
 
పెంపుడు శునకాలతో పాటు మేకలు కూడా మానవుల పట్ల ప్రేమను చూపగలవని తాజా అధ్యయనంలో తేలింది. శునకాల తర్వాత మనుషులకు స్నేహితులుగా ఉండే జంతువులు మేకలేనని లండన్‌లోని క్వీన్‌ మేరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధన బృందం నిర్వహింటిన పరిశోధనలో తేలింది. శునకాలు ఏవిధంగా మనుషులతో మమేకమవుతాయో మేకలు కూడా వాటిలాగే ప్రవర్తిస్తాయని పరిశోధకులు నిరూపించారు. 
 
ఈ పరిశోధనలో మూసి ఉంచిన పెట్టెను తెరిచేందుకు విఫలయత్నం చేసిన మేక అది తెరవకపోయేసరికి యజమాని ముందుకొచ్చి బిత్తరచూపులు చూసి మళ్లీ తెరిచేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో అది పెంపుడు శునకం లాగానే మేక కూడా ప్రవర్తించిందని పరిశోధకులు నిర్ణయించారు. దీంతో కుక్కల్ని పెంచేందుకు బదులు లండన్‌లో మేకల్ని పెంచుకుంటున్నారని సైంటిస్టులు తెలిపారు. 34 మేకలపై నిర్వహించిన ఈ పరిశోధనలో యజమానుల పట్ల మేకలు విశ్వాసంగా ఉన్నాయని.. ఓనర్లపై ప్రేమను చూపిస్తున్నాయని తేలింది.